తారానగర్‌లో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్‌లో దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, రాంచందర్, గోపి, కవిత, నరేందర్ బల్ల, ప్రవీణ్, అజయ్‌తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here