శేరిలింగంపల్లి, అక్టోబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ సర్కిల్ 48 పరిధిలోని హఫీజ్‌పేట్ డివిజన్ (వార్డు 236), మదీనాగూడ డివిజన్ (వార్డు 237) పరిధిలోని మైత్రి నగర్‌లో గురువారం వన్ డే.. వన్ వార్డు (ODOW) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమీక్ష సమావేశంతో పాటు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. మాజీ కార్పొరేటర్‌తో పాటు ఇంజినీరింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (SWM), టౌన్ ప్లానింగ్, అర్బన్ బయోడైవర్సిటీ (UBD), వెటర్నరీ తదితర లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులతో కలిసి అధికారులు ప్రాంతంలో పర్యటించారు. స్థానిక రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ల (RWAs) ప్రతినిధులతో కలిసి ఆయా విభాగాలకు సంబంధించిన సమస్యలను పరిశీలించి, అవసరమైన చర్యలపై సమీక్షించారు. కార్యక్రమంలో మియాపూర్ సర్కిల్-48కు చెందిన సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






