శేరిలింగంపల్లి, అక్టోబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపిస్తూ ప్రతి పౌరుడి ఓటు హక్కును పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో లోక్‌భవన్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వి. జగదీశ్వర్ గౌడ్‌తో కలిసి మియాపూర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. యలమంచి ఉదయ్ కిరణ్, కావూరి ప్రసాద్, రాంచందర్ గౌడ్, రవి కుమార్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సాయి మనోజ్ రెడ్డి, సాయి లోహినాథ్, శశి, డేవిడ్ తదితరులు నిరసనలో పాల్గొన్నారు.

ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్‌భవన్ వరకు సాగిన ర్యాలీలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులు, ప్రతి పౌరుడి ఓటు హక్కు పవిత్రతను కాపాడాలని కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. లోక్‌భవన్ వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టులతో ప్రజల గొంతును అణచివేయలేరని, ఓటు హక్కు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం కలిగేలా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిర్వహించాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉందని నాయకులు అన్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలకు తావులేకుండా పారదర్శక విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై సమాధానం చెప్పాల్సిన సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమి ఎంపీల అరెస్టులను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఈ పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కే ప్రజల అసలైన బలం. ఆ ఓటు హక్కును కాపాడే వరకు మా పోరాటం కొనసాగుతుంది అని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ హక్కుల రక్షణ, ప్రతి పౌరుడి ఓటు హక్కు భద్రత కోసం ప్రజల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత, ప్రజలు పాల్గొన్నారు.





