మియాపూర్‌లో రూ.70 లక్షలతో సీసీ రోడ్డు పనులు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్‌పేట్ విలేజ్ పెద్దకుడి చెరువు కట్టపై రూ.70 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ సీఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. మక్తా మహబూబ్‌పేట్ విలేజ్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, పనుల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.

ప్రజలకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని శ్రీకాంత్ తెలిపారు. నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో ఉమ్మడి మియాపూర్ డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, డివిజన్ ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటానని శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంసీ ఏఈ నిఖిల్, స్థానిక నాయకులు మాధవరం గోపాల్‌రావు, చందు యాదవ్, సతీష్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు జగదీష్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here