శేరిలింగంపల్లి, అక్టోబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): డాక్టర్ హెగ్డెవార్ శత జయంతి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రశాంత్ నగర్ కాలనీలో ఉన్న శ్రీ కట్టమైసమ్మ మహాలక్ష్మి దేవాలయంలో సాయంత్రం 6 గంటలకు స్వర్ణామృత ప్రాశన ఔషధ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నవజాత శిశువుల నుంచి 16 సంవత్సరాల వయస్సు వరకు ఉన్న పిల్లలకు ప్రతి నెలా పుష్యమి నక్షత్రం రోజున ఔషధం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దీనివల్ల పిల్లల్లో ఆకలి, జీర్ణక్రియ మెరుగుపడతాయని, శరీర కాంతి, వర్ఛస్సు పెరుగుతాయని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని, ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు తమను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జంగం గౌడ్, రమేష్, శివ, భరత్ రెడ్డి, శ్రీకాంత్, మనోహర్ రావు పాల్గొన్నారు.






