శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్‌లో గణేష్ నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిరియాల ప్రీతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన నిర్వాహకులు, కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు, యువతను ఆయన అభినందించారు. నిమజ్జన కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో గణనాథుడి నిమజ్జన వేడుకలు ముగిశాయి.





