శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం పాట భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ తో పాటు భక్తులు, స్థానిక ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

వేలం పాటలో గణేష్ లడ్డూను దక్కించుకునేందుకు పలువురు ఆసక్తి చూపగా.. చివరకు కాంట్రాక్టర్ వెంగళరావు రూ.1.80 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. అత్యధిక ధరకు లడ్డూను సొంతం చేసుకున్న వెంగళరావును నిర్వాహకులు, భక్తులు అభినందించారు. గణనాథుడి ఆశీస్సులతో వెంగళరావుకు సకల శుభాలు కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





