శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షురాలిగా నియమితులైన చిగిరింత పారిజాత నరసింహారెడ్డిని కాంగ్రెస్ పార్టీ, INTUC, టీపీసీసీ లేబర్ సెల్ నాయకులు, నాయకురాళ్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన డీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన పారిజాత నరసింహారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమన్వయంతో ముందుకు సాగాలని నాయకులు ఆకాంక్షించారు.

తనను రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నియమించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి పారిజాత నరసింహారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో INTUC రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, టీపీసీసీ లేబర్ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ నల్ల సంజీవ రెడ్డి, టీపీసీసీ లేబర్ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వీరమల్ల వీరేందర్ గౌడ్, టీపీసీసీ లేబర్ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, శేరిలింగంపల్లి నియోజకవర్గం A-బ్లాక్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉయ్యూరు శ్రీదేవి, మహేశ్వరం నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సమత, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, టీపీసీసీ లేబర్ సెల్ గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ ముద్దంగుల తిరుపతి, టీపీసీసీ లేబర్ సెల్ శేరిలింగంపల్లి నియోజకవర్గం జనరల్ సెక్రటరీ బ్రహ్మానందం నాగరాజ్, ఉమ్మడి మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అడ్వైజర్, మియాపూర్ డివిజన్ మాజీ వార్డు మెంబర్ సంగీత వీరేందర్ గౌడ్, ముద్దంగుల హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.





