అవాసా కో-లివింగ్‌లో విషాదం.. టెర్రస్‌పై నుంచి దూకి యువకుడి మృతి

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): అయ్యప్ప సొసైటీ పరిధిలోని అవాసా కో-లివింగ్‌లో 23 ఏళ్ల యువకుడు టెర్రస్‌పై నుంచి దూకి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం ప్రాంతానికి చెందిన కలమట యశ్వంత్ (23), కలమట రమేష్ కుమారుడు. అత‌ను సెప్టెంబర్ 2 నుంచి అయ్యప్ప సొసైటీలోని అవాసా కో-లివింగ్‌లోని గది నంబర్ 206లో నివసిస్తున్నాడు. జనవరి నుంచి డెలాయిట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మంగళవారం ఉదయం యశ్వంత్ అస్వస్థతకు గురికావడంతో వైరల్ ఫీవర్ ఏమైనా ఉందా అనే నిర్ధారణ కోసం డాక్టర్ వద్ద రక్త నమూనాలు ఇచ్చినట్లు సమాచారం. అనంతరం సుమారు మధ్యాహ్నం 3:08 గంటల సమయంలో టెర్రస్‌పై నుంచి దూకినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో యశ్వంత్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు దారితీసిన పూర్తి కారణాలు, పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here