సీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా గణేష్ పూజ

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 15 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ప్రధాన కార్యాలయంలో గణేష్ పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సీఎంసీ కమిషనర్ సృజ‌న‌తో పాటు వివిధ విభాగాల అధిపతులు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది శ్రీ గణేశుడిని జ్ఞానం, శ్రేయస్సు, సౌభ్రాతృత్వాన్ని ప్రసాదించాలని, విఘ్నాలను అధిగమించే శక్తిని అందించాలని ప్రార్థించారు. ప్రజలకు మరింత మెరుగైన పౌర సేవలు అందించడంతోపాటు సైబరాబాద్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సీఎంసీ చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. గణేష్ పూజా కార్యక్రమం సీఎంసీ అధికారులు, సిబ్బంది మధ్య ఐక్యత, సామరస్యం, సమిష్టి బాధ్యతాభావాన్ని చాటిచెప్పింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here