శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): వినాయక చవితి సందర్భంగా చందానగర్ డివిజన్ పరిధిలోని రాజీవ్ నగర్లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిరియాల ప్రీతమ్ తన కుటుంబ సభ్యులతో కలిసి కాలనీవాసులతో ఈ కార్యక్రమంలో పాల్గొని విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిరియాల రాఘవ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మిరియాల రాఘవరావు కూడా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా మిరియాల ప్రీతమ్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వినాయక చవితి సందర్భంగా భక్తులు సాధ్యమైనంత వరకు మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని సూచించారు. పర్యావరణానికి హాని కలిగించని విధంగా పండుగలను నిర్వహించుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజీవ్ నగర్ కాలనీవాసులు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.





