శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ బీఆర్ఎస్ యువజన అధ్యక్షుడు బీఎస్ఎన్ కిరణ్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు అట్టేపల్లి రామప్రభు, సిద్దనబోయిన పురుషోత్తం యాదవ్‌లు కిరణ్ యాదవ్‌ను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కిరణ్ యాదవ్‌కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బొబ్బ నవతా రెడ్డి, నిమ్మల రామకృష్ణ గౌడ్, కొంచ శివరాజ్, చంద్రిక ప్రసాద్, కలిదిండి రోజా, వరలక్ష్మి, పిల్లి నాగరాజు, వేముల రాజశేఖర్, సోంటెనా గంగాధర్, అట్టేపల్లి ప్రశాంత్, అడప అజయ్ తదితరులు పాల్గొని కిరణ్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.






