శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు సంప్రదాయాలను కొనసాగిస్తూ పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించాలనే ఉద్దేశంతో యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. మియాపూర్, మక్తా మహబూబ్‌పేట్ డివిజన్ల పరిధిలోని సాయిరాం నగర్ కాలనీ, జనప్రియ వెస్ట్ సిటీ, ఆరోబిందో కాలనీలలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ట్రస్ట్ ప్రతినిధులు, స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు, నాయకులు, యువతతో కలిసి యలమంచి ఉదయ్ కిరణ్ కాలనీ వాసులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా యలమంచి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.. సంప్రదాయాలకు గౌరవం ఇవ్వడంతోపాటు ప్రకృతిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. పర్యావరణానికి హాని కలిగించే విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించి వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో పర్యావరణహితంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. మట్టి విగ్రహాల వినియోగంతో నీటి వనరుల కాలుష్యాన్ని తగ్గించవచ్చని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన పేర్కొన్నారు. పండుగల సమయంలో తీసుకునే చిన్నచిన్న బాధ్యతాయుత నిర్ణయాలు భావితరాలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు దోహదపడతాయని తెలిపారు.

భక్తితో వినాయకుడిని ఆహ్వానిద్దాం.. బాధ్యతతో ప్రకృతిని పరిరక్షిద్దాం అనే సందేశంతో పర్యావరణహిత వినాయక చవితిని ప్రజలు ప్రోత్సహించాలని యలమంచి ఉదయ్ కిరణ్ కోరారు. కార్యక్రమాల్లో సాయిరాం నగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు షా, రోజా, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, సాంబశివరావు, నవీన్, సుజాత తదితరులు పాల్గొన్నారు. జనప్రియ వెస్ట్ సిటీ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ రెడ్డి, గోవర్ధన్, ప్రసాద్‌తో పాటు మహేష్, శంకర్ రావు, భాస్కర్ రావు, రామలింగం, సాయి, హరికృష్ణ, GVL శర్మ, మూర్తి, అనిల్, బాలి రెడ్డి, అర్చన, అట్లూరి పద్మ, శంకర్, రామకృష్ణ తదితరులు హాజరయ్యారు.
ఆరోబిందో కాలనీకి చెందిన లోకేష్, రమేష్, సుబ్రహ్మణ్యం, రాజు, పరమేష్, రవికృష్ణ, రాజేష్ తదితరులతో పాటు శరత్, సుబ్బు, శివ, రాంబాబు, రాధాకృష్ణ, వంశీ, నాగసాయి, ప్రవీణ్, శశి, వెంకట్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో స్థానిక నాయకులు, యువత, మహిళలు, కాలనీ వాసులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.





