శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌లో బీఆర్ఎస్‌కు మరింత బలం చేకూరింది. ఉమ్మడి మియాపూర్ డివిజన్ మాజీ బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎం.జి.ఎం. చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మర్రపు గంగాధర రావుతో పాటు పలువురు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే, శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ మాధవరం కృష్ణారావు సమక్షంలో గంగాధర రావు, ఆయన అనుచరులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్, మాధవరం కృష్ణారావు వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.

గంగాధర రావుతో పాటు రవి గౌడ్, స్వామి నాయక్, మోహన్ నాయక్, కిరణ్ నాయక్, మురళి నాయక్, జితేంద్ర నాయక్, గోపి నాయక్, తిరుపతి నాయక్, రాజేష్, మధు, బాబు, విష్ణు, చింటూ తదితరులు బీఆర్ఎస్‌లో చేరిన వారిలో ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్, మాధవరం కృష్ణారావు నాయకత్వంపై విశ్వాసంతోనే పార్టీలో చేరినట్లు కొత్తగా చేరిన నాయకులు తెలిపారు. మియాపూర్‌తో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్‌ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. సీనియర్ నాయకులు, యువత, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మియాపూర్ సీనియర్ బీఆర్ఎస్ నాయకురాలు కలిదిండి రోజాతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





