శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌కు చెందిన పలువురు నాయకులు, యువత శనివారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో వారు బీఆర్‌ఎస్ కండువాలు కప్పుకున్నారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో అనేక అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన అనేక సంక్షేమ పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం గండి కొట్టిందని విమర్శించారు. దీంతో ప్రజల జీవన ప్రమాణాలు, పరిస్థితులు అధ్వానంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ నాయకత్వం రావాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఆకాంక్షతోనే బీఆర్‌ఎస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, సీనియర్ నాయకులు కలిదిండి రోజా, గంగాధర్, అట్టేపల్లి పురుషోత్తం, అట్టేపల్లి శ్రీరాములు, అట్టేపల్లి దయాకర్, ఎస్.ఆర్. బాబ్జీ, కృష్ణ, వీర రమేష్, తంగెళ్ల శ్రీనివాస్, యెడ్ల హరినాథ్, నాగిశెట్టి వినీత్, అట్టేపల్లి ప్రశాంత్, అడప అజయ్, శ్రీనివాస్ గౌడ్, హనీఫ్, ఎం. గంగాధర్, ఎ. దేవేందర్, ఎం. సాయి కుమార్ గౌడ్, కె. శ్రీను, కె. రాజు, టి. ప్రదీప్, సత్తి, చిన్న, నవీన్, తరుణ్, గన్నీ, పండు తదితరులు పాల్గొన్నారు.





