అంజయ్య నగర్, హైటెక్ సిటీ డివిజన్లలో రూ.1.80 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 12 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అంజయ్య నగర్, హైటెక్ సిటీ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, ఉమ్మడి కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్‌తో కలిసి స్థానిక నాయకులు, ప్రజలు, కార్యకర్తలు, అధికారుల సమక్షంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నూతన అంజయ్య నగర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ కాలనీలో హిందూ శ్మ‌శాన వాటిక అభివృద్ధి పనులను రూ.1.53 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. ఇందుకు ఎమ్మెల్యే గాంధీ, మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ శంకుస్థాపన చేశారు.

అదేవిధంగా నూతన హైటెక్ సిటీ డివిజన్ పరిధిలోని మాదాపూర్ డాక్టర్స్ కాలనీలో రూ.27 లక్షలతో నూతన సీసీ రోడ్ల నిర్మాణం, వరద నీటి కాలువ (స్ట్రామ్ వాటర్ డ్రైన్) పనులను చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రహదారులు, డ్రైనేజీ, వరద నీటి కాలువలు, ఇతర ప్రజా అవసరాలకు సంబంధించిన పనులను దశలవారీగా పూర్తి చేస్తామని తెలిపారు. మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. కాలనీలకు అవసరమైన అభివృద్ధి పనులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు షేక్ హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్, నీలం రవీందర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ఊట్ల దశరథ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మోడల నరసింహ సాగర్, ఆంజనేయులు సాగర్, షేక్ చాంద్ పాషా, ముత్తోజు విక్రమ్ చారి, కే. శ్రీను సాగర్, మొగుల స్వామి సాగర్, గువ్వల రమేష్, రవి శంకర్ నాయక్, షేక్ జుబెర్, ఏండి ఘోస్, కాలే బసవరాజు, డి. తిరుపతయ్య సాగర్, కే. కృష్ణ సాగర్, జీ. రవీందర్ సాగర్, డి. చెన్నయ్య సాగర్, అంజాద్, పంతం గణపతి, బుడుగు తిరుపతి రెడ్డి, తిరుపతి యాదవ్, లక్ష్మి బాయి, యాదయ్య గౌడ్, వెంకటేష్, రమేష్, దిలీప్, షేక్ ఖాజా, గోవర్ధన్ ముదిరాజ్, ఎం పరశురామ్, జీ. తిరుపతయ్య, అర్బాజ్ ఖాన్, ఏం వెంకటేష్ సాగర్, మురళి సాగర్, రాజు సాగర్, జీ. యాదమ్మ, కార్తీక్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here