మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: బేరి రామచందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 12 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులనే పూజించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ పిలుపునిచ్చారు. గచ్చిబౌలి డివిజన్ నల్లగండ్ల నేతాజీ నగర్ కాలనీలో కాలనీ ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు డీఈఈ ఆనంద్, సూపర్వైజర్లు భరత్, రాందాస్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో పాటు రసాయనిక రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీటి కాలుష్యం పెరుగుతోందన్నారు.

రసాయనాలతో కలుషితమైన నీటిని జలచరాలు, పశువులు తాగడం వల్ల వాటి ప్రాణాలకు ముప్పు ఏర్పడటంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన నీరు, మంచి గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ అనే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాలనీ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై బోలో గణేష్ మహారాజ్ కీ జై అంటూ నినదించారు.

ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, ఎన్.ఎన్. రెడ్డి, బోటిక్ టెక్స్టైల్స్ ప్రొప్రైటర్ కుషన్ రెడ్డి, బీసీ కులాల ఐక్యవేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరిపురం హరికృష్ణ చారి, శేరిలింగంపల్లి ముదిరాజ్ సంఘం ఇన్‌చార్జి కొత్త మనోజ్, మార్వాడి శంకర్, నరేష్, సురేష్ నాయక్, రంగస్వామి, బేరి చంద్రశేఖర్ యాదవ్, కృష్ణ గౌడ్, అశోక్‌తో పాటు కాలనీ పెద్దలు, యువజన నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here