శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): జనప్రియ వెస్ట్ సిటీలో వక్రతుండ యువశక్తి టీమ్ ఆధ్వర్యంలో గణేష్ ఆగమనం కార్యక్రమాన్ని శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నృత్యాలు, కోలాటాలతో గణనాథుడిని ఘనంగా స్వాగతిస్తూ భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ మల్లేశం, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తౌటి సంతోష్ రెడ్డి, గోపరాజు శ్రీనివాస్, కలిదిండి రోజా, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ వేడుకలో కాలనీ అంతా సందడిగా మారింది. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కమిటీ సభ్యులు, స్థానికులు కీలకంగా వ్యవహరించారు.






