శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడలో శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ సంవత్సరం వినాయకుడి ఆగమన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్య అతిథిగా హాజరై గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భారీ వినాయక విగ్రహాన్ని డీజే, డప్పు వాయిద్యాలు, భక్తుల నృత్యాలు,‘గణపతి బప్పా మోరియా నినాదాల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి మండపంలో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా పదేళ్లుగా నిరంతరంగా వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులను సాయిబాబా అభినందించారు. వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులతో పాటు స్థానిక సీనియర్ నాయకులు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






