వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి ఘనంగా.. భారీగా పాల్గొన్న కాలనీవాసులు

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 10 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్‌ డివిజన్‌ పరిధిలోని శివాజీనగర్ వీకర్‌ సెక్షన్‌ కాలనీలో వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఈశ్వర రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, స్థానిక నాయకులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్‌ నాయకుడు పార్ నంది శ్రీకాంత్‌ పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సమాజం కోసం ఐలమ్మ చేసిన పోరాటం, ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు. ఆమె పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు హనుమంతు, పరుశురాం, ప్రతాప్‌ రజక, దొంతి చిన్న, త్రినేత్ర, రాజశేఖర్‌, వాసు, నవీన్‌, అంజి, జగదీష్‌, మల్లేష్‌ యాదవ్‌, ఉపేంద్ర, అప్సర్‌, సంతోష్‌, అశోక్‌, రమేష్‌, చైతన్య, శ్రీకర్‌, రిషి, బబ్లు, శశి, జ్ఞానేష్‌తో పాటు సంఘం సభ్యులు, మహిళలు, కాలనీవాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here