సైబరాబాద్‌ పోలీస్‌ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం.. అధ్యక్షుడిగా ఎస్సై శ్రీనివాస్‌

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 10 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్‌ పోలీస్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా ఎస్సై శ్రీనివాస్‌ (హెచ్‌సీ–3046), ఉపాధ్యక్షుడిగా ఇన్‌స్పెక్టర్‌ శ్రీకర్‌బాబు (19435) ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కె.క్రాంతి కుమార్ ఎస్సై/ఏఎస్సై కేటగిరీలో ప్రియదర్శిని (3251), హెడ్‌ కానిస్టేబుల్‌ కేటగిరీలో కార్తిక్‌ శ్రీనివాస్‌ (3276), పోలీస్‌ కానిస్టేబుల్‌ కేటగిరీలో రాజేందర్‌ (5180) వైస్‌ ప్రెసిడెంట్లుగా ఎన్నికయ్యారు. వివిధ పదవులకు మొత్తం 29 మంది సభ్యులు నూతన కార్యవర్గంలో ఎన్నికయ్యారు.

నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ డా. రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీపీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్‌ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అసోసియేషన్‌ ద్వారా పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here