శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ, ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు గడుస్తున్నా అనేక హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని మాజీ కార్పొరేటర్, బీఆర్ఎస్ నాయకుడు మాధవరం రంగారావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా రిక్షా పుల్లర్స్ కాలనీలో ఇంటింటికీ తిరిగి బాకీ కార్డులు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, స్థానిక నాయకులతో కలిసి మాధవరం రంగారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చిందన్నారు. ఆ హామీలను నమ్మిన ప్రజలు కాంగ్రెస్కు అధికారం అప్పగించారని తెలిపారు. అయితే ప్రభుత్వం ఏర్పడి సుమారు వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఇచ్చిన హామీల్లో అనేకం ఇంకా అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, బాబురావు, ఆంజనేయులు, వెంకన్న, ప్రవీణ్, విక్రమ్, కిరణ్, రవి, శానప్ప, రాజు, శేఖర్, యాదగిరి, రాము, ఆనంద్, నాగేష్, గిల్బర్, జగదీష్, చందు, రామ్మూర్తి, శైలజ, హరి, కుమార్, శ్రీనివాస్, టీచర్ బాబురావు, చంద్రయ్య, దూపల్లి కుమార్, పింటూ, సంతోష్, బాబు, జై, నరేష్, నరసింహ, నవీన్, బద్రి, టిల్లు, వినయ్, హరీష్, వినోద్, స్టాలిన్, భరత్ తదితరులు పాల్గొన్నారు.





