విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల‌ను వెంటనే చెల్లించాలి: తెలంగాణ రక్షణ సేన

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ర్యాలీ, భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రక్షణ సేన కవిత ఆదేశాల మేరకు మదీనాగూడ గాంధీ సర్కిల్ నుంచి చందానగర్ ఓల్డ్ గాంధీ సర్కిల్ వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. తెలంగాణ రక్షణ సేన శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం భిక్షాటన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఇస్తామని హామీ ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్, రూ.5 లక్షల ప్రమాద బీమా, స్కూటీల పంపిణీ వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు, వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కుమార్, దయానంద్ ముదిరాజ్, సందీప్ డిసోజు, విష్ణు, రఘు, పవన్‌తో పాటు పలువురు విద్యార్థులు, తెలంగాణ రక్షణ సేన నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here