నాసిక్‌లో సెప్టెంబర్ 7 నుంచి 3ఏ సైడ్ వాలీబాల్ నేషనల్ ఛాంపియన్‌షిప్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): 3ఏ సైడ్ వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో, మహారాష్ట్ర స్టేట్ 3ఏ సైడ్ వాలీబాల్ అసోసియేషన్ నిర్వహణలో 2వ యూత్ అండర్-21 బాలబాలికలు, అండర్-14 బాలబాలికల 3ఏ సైడ్ వాలీబాల్ నేషనల్ ఛాంపియన్‌షిప్-2026 జరగనుంది. ఈ జాతీయ స్థాయి పోటీలు సెప్టెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న మీనా తాయి ఠాక్రే స్టేడియంలో నిర్వహించనున్నారు.

ఈ ఛాంపియన్‌షిప్‌లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్, జమ్మూకశ్మీర్, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, కర్ణాటక, ఢిల్లీ, చండీగఢ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, విదర్భ, దమన్ అండ్ డయ్యూ, పుదుచ్చేరి తదితర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన జట్లు పాల్గొననున్నాయి. అండర్-21, అండర్-14 విభాగాల్లో బాలురు, బాలికలకు పోటీలు నిర్వహించడంతో యువ క్రీడాకారులకు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించనుంది. వాలీబాల్ క్రీడను మరింత ప్రోత్సహించడంతో పాటు భవిష్యత్ ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్నారు. వన్ గేమ్.. వన్ టీమ్.. వన్ ప్యాషన్ అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ జాతీయ పోటీలు యువతలో క్రీడాస్ఫూర్తి, జట్టుగా ఆడే నైపుణ్యం, ప్రతిభను పెంపొందించేందుకు దోహదపడనున్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here