శిల్పారామంలో అలరించిన మొహినియాట్టం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. ఆదివారం నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా సౌమ్య అనంత్ మొహినియాట్టం నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మొహినియాట్టం ప్రదర్శనలో పరిపాలయమాం కృతి, అలివేణి పదం, తిల్లాన తదితర అంశాలను సౌమ్య అనంత్ ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అనంతరం మానస స్కూల్ ఆఫ్ డాన్స్ గురువు ప్రణవి తుమ్మటి ఆధ్వర్యంలోని శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించింది. మూషిక వాహన, మీనాక్షి పంచరత్న, రామదాసు కీర్తన, ముద్దుగారే యశోద, జతిస్వరం, బ్రహ్మాంజలి తదితర అంశాలను శ్రీనిత, అహనా, అవంతిక, రూపశ్రీ, ఆధ్య, రితిక, స్నిగ్ధ తదితరులు ప్రదర్శించారు. సాంప్రదాయ నృత్యరూపాలను అందంగా ఆవిష్కరించిన కళాకారుల ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. శిల్పారామం వేదికగా వారాంతాల్లో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు కళాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here