రాగం సుజాత యాదవ్ మృతికి ప్రముఖుల సంతాపం.. కుటుంబ సభ్యులకు పరామర్శ

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్‌పర్సన్ రాగం సుజాత యాదవ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మాజీ ఎంపీ, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నల్లగండ్లలోని మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాగం సుజాత యాదవ్ మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

అదేవిధంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పుల ప్రవీణ్ కుమార్, హ్యూమన్ రైట్స్ కమిషన్ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఆర్. లక్ష్మీ రామకృష్ణ కూడా నల్లగండ్లలోని రాగం నాగేందర్ యాదవ్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాగం సుజాత యాదవ్ మృతికి సంతాపం తెలియజేసి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here