శేరిలింగంపల్లి, ఆగస్టు 17 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని బీజేపీ హఫీజ్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్‌ను కలిసి ప్రజా సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కైతాపురం జితేందర్ మాట్లాడుతూ.. హఫీజ్‌పేట్ డివిజన్‌లోని మదీనాగూడ గ్రామం ప్రధాన రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని కోరారు. హుడా కాలనీలో పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్డు పనులు, హఫీజ్‌పేట్ సాయినగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లే రోడ్డు, హిందూ శ్మశానవాటికకు వెళ్లే పెండింగ్ సీసీ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు.

అలాగే హుడా కాలనీ రైతు బజార్‌ను స్థానిక ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హఫీజ్‌పేట్ గ్రామంలోని ఖైదమ్మకుంట వద్ద ప్రతిరోజూ చెత్త సేకరణ చేపట్టాలని, ఖైదమ్మకుంట చెరువులోకి వర్షపు నీరు చేరేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. హఫీజ్‌పేట్ కుమ్మరబస్తీలో పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్డు పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని జితేందర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అజిత్ కుమార్ సేనాపతి, హఫీజ్‌పేట్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి మారెళ్ల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు ప్రసాద్ పాత్రో, బీజేపీ నాయకులు మోహన్ ముదిరాజ్, శేఖర్ ముదిరాజ్, అశోక్ ముదిరాజ్, సాయి నాయక్, మల్లేష్, శ్రీకాంత్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.





