శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను పురస్కరించుకొని మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో బోనాల మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మియాపూర్ కాంగ్రెస్ నాయకుడు, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మియాపూర్ స్టాలిన్ నగర్‌లోని ఎల్లమ్మ పోచమ్మ దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాలు, తొట్టెల ఊరేగింపు మహోత్సవంలో టెంపుల్ కమిటీ, అసోసియేషన్ సభ్యులు ప్రభాకర్, శంకర్, నవీన్, పవన్‌ల ఆహ్వానం మేరకు యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మియాపూర్ ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆయన ప్రార్థించారు. చందానగర్‌లోని పోచమ్మ దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల మహోత్సవంలో కట్ల శేఖర్ రెడ్డి, శ్రీకాంత్‌ల ఆహ్వానం మేరకు యలమంచి ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజలందరిపై అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నిండాలని యలమంచి ఉదయ్ కిరణ్ ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో జరుపుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో శరత్, రాధాకృష్ణ, వంశీ, ప్రవీణ్, రత్నాచారి, నాగసాయి, సాయి నిఖిల్, రామ్, భువనేశ్వర్ తదితరులతోపాటు కాలనీ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, టెంపుల్ కమిటీ, అసోసియేషన్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.





