శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (నమస్తే శేరిలింగంపల్లి): బోనాల పండుగ సందర్భంగా ఉమ్మడి మాదాపూర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో మాజీ ఉమ్మడి మాదాపూర్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మణ్, అభి, నరేందర్ రెడ్డితోపాటు స్థానిక నాయకులు, బస్తీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.






