ముత్యాలమ్మ బోనాల సందర్భంగా రాజోలు ఆలయంలో మొక్కల నాటకం

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ముత్యాలమ్మ అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా రాజోలు గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజుల స్వామి ఆలయ ప్రాంగణంలో మొక్కల నాటకం నిర్వహించారు. ప్రతి పూజలో ప్రప్రథమంగా వినియోగించే కొబ్బరికాయకు ప్రతీకగా కొబ్బరి మొక్కతో పాటు పునాస మామిడి, పునాస జామ మొక్కలను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి రాజోలు గ్రామానికి చెందిన కురుమ వెంకటేశ్వర్లు నాటారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో పచ్చదనాన్ని పెంపొందించడంతోపాటు భవిష్యత్ తరాలకు పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అందించాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మేకల గంగాధర్, పోచారపు ఉప్పలయ్య, తాటి వెంకన్న, కాతాజీ నాగచారి, ఈడిగపెల్లి కనకయ్య, శ్రీ శివాలయ కమిటీ బాధ్యులు బస్వరామ్మూర్తి, రాజోలు గ్రామానికి చెందిన సిరిగద్దె రవికుమార్, సూరం మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here