శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ ప్రశాంతి నగర్ లోని శ్రీశ్రీశ్రీ విజయ దుర్గ భవాని అమ్మవారి విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని, ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు సమాజంలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ అశోక్, మురుగేష్, శ్రీనివాస్, సత్తి కుమార్, గోపాల్, ప్రణేష్, బాపునగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజకుమార్, సుధాకర్ రెడ్డి, కృష్ణ స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు. సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






