శేరిలింగంపల్లిలో మ‌హిళ‌కి CMRF స‌హాయం.. మంజూరు పత్రం అందజేసిన గాంధీ

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీకి చెందిన జయలక్ష్మికి అత్యవసర వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి మంజూరైన రూ.4 లక్షల ఆర్థిక స‌హాయానికి సంబంధించిన లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) మంజూరు పత్రాన్ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్‌తో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆరెకపూడి గాంధీ, ప్రభుత్వం తరఫున మంజూరైన రూ.4 లక్షల CMRF-LOC పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఎంతో ఉపయోగకరమైన పథకమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు నిరంతరం అండగా నిలుస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య చికిత్స పొందలేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ కీలక భరోసాగా నిలుస్తోందని చెప్పారు.

వైద్య చికిత్స కోసం రూ.4 లక్షల ఆర్థిక సహాయం అందేలా సహకరించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంత్రి ప్రగడ సత్యనారాయణతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here