కేటీఆర్ 50వ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

శేరిలింగంప‌ల్లి, జూలై 23 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు (కేటీఆర్) 50వ పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న GIFT A SMILE కార్యక్రమంలో భాగంగా బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. ఉమ్మడి చందానగర్ డివిజన్ పరిధిలోని ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మినిమమ్ వేజ్ బోర్డ్ చైర్మన్ సామ వెంకట్ రెడ్డి, బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఎంపీపీ ఉర్దూ మీడియం స్కూల్, వేముకుంట ఎంపీపీ తెలుగు మీడియం స్కూల్, వేమన వీకర్ సెక్షన్ ఎంపీపీ స్కూల్, శివాజీనగర్ బస్తీ ఎంపీపీ స్కూల్, ఇందిరానగర్ బస్తీ ఎంపీపీ స్కూల్‌లలో సుమారు 600 మంది విద్యార్థులకు 5వేల‌ నోట్‌బుక్స్, 600 పెన్సిల్ బాక్స్‌లు (పెన్నులు, పెన్సిల్, స్కేల్, షార్పనర్, ఎరేజ‌ర్‌తో సహా) పంపిణీ చేశారు. మొత్తం రూ.3 లక్షల విలువైన విద్యా సామగ్రిని పేద విద్యార్థులకు కేటీఆర్ జన్మదిన కానుకగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ శర్మ, రాజన్న, ఎం.డి. సలీం, చందర్ రావు, నగేష్ రెడ్డి, ప్రమోద్, అంజి, శేఖర్, వంశీ రెడ్డి, రామారావు, అనంత రెడ్డి, శభన, సునీత, శ్రీను, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here