శంసీగూడ, ఆల్విన్ కాలనీలో సీఎంసీ కమిషనర్ సృజ‌న‌ పర్యటన

శేరిలింగంప‌ల్లి, జూలై 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజ‌న‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో కలిసి కూకట్‌పల్లి జోన్‌లోని ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలో ఉన్న శంషీగూడ, ఆల్విన్ కాలనీ వార్డులను సందర్శించి పౌర సమస్యలను సమీక్షించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సర్కిల్ బృందం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ స్థానిక ప్రజలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశమై వార్డుల్లో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతుల పరిస్థితిపై చర్చించారు. స్థానికులు మురుగునీటి పారుదల, తాగునీటి సరఫరా, రహదారుల నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు, చెత్తను సకాలంలో తరలించడం, పారిశుద్ధ్య సేవల మెరుగుదల వంటి అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.

పారిశుద్ధ్య నిర్వహణలో పారదర్శకత కోసం స్ప్రేయింగ్, గ్యాంగ్ స్వీపింగ్ షెడ్యూళ్లను రూపొందించి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లతో పంచుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. అలాగే 450–500 ఇళ్లకు సేవలందించే సామర్థ్యం కలిగిన కొత్త ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. వార్డు పర్యటనలో గుర్తించిన అన్ని సమస్యలను తదుపరి సందర్శనకు ముందే పరిష్కరించాలని, ప్రతి ఫిర్యాదుకు గడువు నిర్ధారించి పనుల పురోగతిని స్థానికులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సంబంధిత శాఖలకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో నేరుగా మమేకమై క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి, అన్ని శాఖల సమన్వయంతో వేగంగా పరిష్కరించడమే వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కమిషనర్ తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here