మల్లికార్జున్ ఖర్గే జన్మదిన వేడుకలు.. నల్లగండ్లలో కాంగ్రెస్ నేతల నిర్వహణ..

శేరిలింగంప‌ల్లి, జూలై 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జన్మదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లగండ్ల గ్రామంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రజాసేవ పట్ల అంకితభావం, రాజ్యాంగ విలువల పరిరక్షణకు కట్టుబాటుతో దేశవ్యాప్తంగా విశ్వసనీయ నాయకుడిగా గుర్తింపు పొందారని అన్నారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవి వరకు ఎదిగిన ఖర్గే, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాడుతూ దేశ ప్రజల హక్కులు, సంక్షేమం, అభివృద్ధి కోసం బలమైన స్వరం వినిపిస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాలింగ్ యాదగిరి గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు జహంగీర్, కావూరి ప్రసాద్, మన్నేపల్లి సాంబశివరావు, యాద గౌడ్, కనకమామిడి నరేందర్ గౌడ్, పట్వారీ శశిధర్, ప్రభాకర్ రెడ్డి, కట్ల శేఖర్ రెడ్డి, గఫర్, దేవరాజ్, జావేద్, లక్ష్మినారాయణ, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి శ్రీహరి గౌడ్, శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సౌందర్య రాజన్, ఉపాధ్యక్షుడు నితిన్ గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నరేందర్ ముదిరాజ్, ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు చంద్రమౌళి, రవికుమార్, భరత్, ఖాజా, ముజీబ్, పద్మారావు, సుధాకర్, అంజద్‌, మహిళా కాంగ్రెస్ నాయకులు రామేశ్వరమ్మ, జయ, శాంత, స్వాతి, శిరీష, వహీదా, అనిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here