గోల్డెన్ తులిప్ కాలనీలో రూ.15 లక్షలతో ఓపెన్ జిమ్ ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, జూలై 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోల్డెన్ తులిప్ కాలనీలో రూ.15 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోల్డెన్ తులిప్ కాలనీలో అన్ని ఆధునిక సౌకర్యాలతో ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఆరోగ్య శేరిలింగంపల్లి త‌న‌ ధ్యేయం అని పేర్కొంటూ, ప్రతి కాలనీ, ప్రతి పార్కులో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓపెన్ జిమ్‌ల ద్వారా కాలనీ ప్రజలు ప్రతిరోజూ వ్యాయామం చేసే అవకాశం కలుగుతుందని, ముఖ్యంగా యువత, మహిళలు, వృద్ధులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి ఇవి దోహదపడతాయని చెప్పారు. అలాగే పిల్లలు, వృద్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆరెకపూడి గాంధీ హామీ ఇచ్చారు. మెరుగైన ప్రజా జీవనానికి అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పిస్తూ, కొండాపూర్ డివిజన్‌తోపాటు శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతానని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కాలనీ ప్రతినిధులు విద్యాసాగర్ రెడ్డి, రాజు, సత్యనారాయణతోపాటు గోల్డెన్ తులిప్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here