శేరిలింగంపల్లి, జూలై 20 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎస్.ఆర్. ఎస్టేట్స్ కమ్యూనిటీ హాల్‌లో గంగాధర శాస్త్రి, రమాదేవి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ జగదాంబిక వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మియాపూర్ యువ నాయకుడు, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్, ఆయన సతీమణి నవ్యశ్రీ దంపతులు నిర్వహించిన రాజశ్యామల యాగం, శ్రీ వారాహి అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు, కాలనీ వాసులు, భక్తులు యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం జగదీశ్వర్ గౌడ్ వేద పండితుల ఆశీర్వాదాలు స్వీకరించి, శ్రీ జగదాంబిక వారాహి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి కృపతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నల్ల సంజీవ్ రెడ్డి, వీరేంద్ర గౌడ్, కృష్ణ, మన్నెపల్లి సాంబశివరావు, కేవీ రావు, రాచమల్ల కృష్ణ గౌడ్ దంపతులు, రవి కుమార్, కావూరి ప్రసాద్, రవీంద్ర రెడ్డి, అశోక్ గౌడ్, వెంకటేశ్వర్లు, బాబ్జీ, సింధూర సుధీర్, ఎం.డి. షా, కేశవరావు, సత్య రెడ్డి, మూర్తి, పద్మిని ప్రియదర్శిని, సత్యనారాయణ, సాంబయ్య, చక్రపాణి, శంకర్ చారి, రామకృష్ణ, రవి కృష్ణ, శ్రీనివాసు, సుధీర్, చిరంజీవి, రాజేష్, నరేంద్ర రెడ్డి, కామినేని వాసు, వంశీ, రత్నాచారి, శశి, సతీష్, ప్రవీణ్, సీనియర్ సిటిజన్స్ గోపీనాథ్, సుబ్బారాయుడు, బాబు, రమణ, నాయుడు, సుబ్బ రెడ్డి, మురళి, రాజు, బాలమురళి, నవీన్, రాజేశ్వరి, పద్మ, పలువురు నాయకులు, భక్తులు, స్థానిక నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





