శేరిలింగంపల్లి, జూలై 18 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ ఆర్. జయరామ్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ విజయ్ నాయక్ లను గిరిజన సంక్షేమ సంఘం నడిగడ్డ తాండ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు శాలువాతో సత్కరించి, పూల బొకే అందజేసి మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం నడిగడ్డ తాండ కమిటీ అధ్యక్షుడు సభవత్ హన్మ నాయక్, ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్, అధ్యక్షుడు రెడ్యా నాయక్, ఉపాధ్యక్షుడు నాయిని రత్న కుమార్, కోశాధికారులు ఎన్. దేవా నాయక్, మాదిలేటి, కమిటీ సభ్యులు తిరుపతి రాథోడ్, వడ్త్యా క్రిష్ణ నాయక్, అంగోత్ మోతిరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.






