శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వైశాలీనగర్ రైల్వే అండర్‌పాస్ వద్ద రోడ్డు విస్తరణ, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల నేపథ్యంలో జూలై 16 నుంచి 20 రోజుల పాటు అండర్‌పాస్‌ను పూర్తిగా మూసివేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. భారీ వర్షాల సమయంలో నీటి నిల్వ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మై హోమ్ మంగళా టీ-జంక్షన్ వద్ద యూ-టర్న్ తీసుకుని, రాఘవేంద్రనగర్ కాలనీ – హైటెన్షన్ రోడ్ – ఆర్టీఏ కార్యాలయం – హఫీజ్‌పేట్ ఆర్ఓబీ మార్గంలో వెళ్లాలి. మై హోమ్ మంగళా టీ-జంక్షన్ – రాఘవేంద్రనగర్ కాలనీ – హైటెన్షన్ రోడ్ – ఆర్టీఏ కార్యాలయం – హఫీజ్‌పేట్ ఆర్ఓబీ/ఫ్లైఓవర్ మీదుగా హఫీజ్‌పేట్, ఆల్విన్ జంక్షన్‌కు చేరుకోవాలి. మై హోమ్ జువెల్ వెనుక గేట్, ఆర్టీసీ కాలనీ, మంజీరా పైప్‌లైన్ రోడ్ నుంచి మై హోమ్ మంగళా వైపు వెళ్లేవారు పైప్‌లైన్ రోడ్ – హఫీజ్‌పేట్ ఆర్ఓబీ/ఫ్లైఓవర్ – జెన్‌పాక్ట్ సమీపం – కొండాపూర్–ఆల్విన్ జంక్షన్ రోడ్ – ప్రభుత్వ పాఠశాల యూ-టర్న్ మార్గాన్ని ఉపయోగించాలి.
వాసవి లేక్ సిటీ, హఫీజ్‌పేట్ లేక్ ప్రాంతాల నుంచి మై హోమ్ మంగళా/రాఘవేంద్రనగర్ వైపు వెళ్లేవారు స్పైర్ వన్ అపార్ట్‌మెంట్స్ యూ-టర్న్ – హఫీజ్‌పేట్ ఆర్ఓబీ/ఫ్లైఓవర్ – జెన్‌పాక్ట్ – కొండాపూర్–ఆల్విన్ జంక్షన్ – ప్రభుత్వ పాఠశాల యూ-టర్న్ మార్గంలో ప్రయాణించాలి. గోపాల్‌నగర్/కల్వరీ టెంపుల్ నుంచి మై హోమ్ మంగళా వైపు వెళ్లేవారు పాత హఫీజ్‌పేట్ నుంచి హఫీజ్‌పేట్ రైల్వే అండర్‌పాస్ మీదుగా కొండాపూర్–ఆల్విన్ జంక్షన్ రోడ్ చేరుకుని, ప్రభుత్వ పాఠశాల యూ-టర్న్ ద్వారా హఫీజ్‌పేట్ ఆర్ఓబీ ఉపయోగించాలి. ట్రాఫిక్ మళ్లింపుల కారణంగా ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకుని, సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.





