శేరిలింగంపల్లి, జూలై 12 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision–SIR) ప్రక్రియలో ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణలో తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వి. జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హఫీజ్‌పేట్ డివిజన్ యూత్ కాలనీలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వో)తో మాట్లాడి, ఓటరు నమోదు ఫారాలను పూర్తిగా పరిశీలిస్తూ ఎలాంటి పొరపాట్లు లేకుండా కచ్చితమైన వివరాలతో నమోదు చేసేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ మీ ఓటు – మీ స్వరం, మీ శక్తి. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా పరిశుభ్రమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన అధికారిక ఓటరు జాబితా రూపకల్పనకు ప్రతి పౌరుడు విలువైన సహకారం అందించవచ్చు అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఇది మన బాధ్యత.. ఇది మన గౌరవం.. ఇది మన సమాజ భవిష్యత్తును నిర్మించే అమూల్యమైన అవకాశం అని పేర్కొన్నారు. మరోసారి వినమ్ర విజ్ఞప్తి చేస్తూ, ప్రతి అర్హత కలిగిన ఓటరు ఎస్‌ఐఆర్ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బలింగ్ యాదగిరి గౌడ్, కనకమామిడి నరేందర్ గౌడ్, సయ్యద్ తహెర్ హుస్సేన్, సంజు, వెంకటేష్ ముదిరాజ్, యాద గౌడ్, సాజిద్, సయ్యద్ బాబా, నదీమ్, రహమత్, ముజీబ్, అంజద్ ఖాన్, అక్బర్, రెహ్మాన్, సిలార్, ఫరూక్, గౌస్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.





