శేరిలింగంపల్లి, జూలై 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రూనగర్‌లో స్థానిక నాయకుడు దేవులపల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో, శ్రీ వేద మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. సమాజంలో ఆరోగ్య అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో శ్రీ వేద మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ రెడ్డి, డాక్టర్ పూర్ణిమతోపాటు కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, నర్సింహా, హరి, ప్రదీప్, మహేందర్ సింగ్, రవీందర్, సైదులు యాదవ్, సలీం, సల్మాన్, షైబాజ్, రఘు, సూరి, రాజేష్, వినయ్, నాందేవ్, హాస్పిటల్ వైద్య సిబ్బంది, స్థానిక నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.






