శేరిలింగంపల్లి, జూలై 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హఫీజ్పేట్ డివిజన్ పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో ప్రతి ఓటరు భాగస్వామ్యం కావాలని హఫీజ్పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ పిలుపునిచ్చారు. ఆదివారం గంగారం గ్రామం, ఇంజనీర్ ఎన్క్లేవ్, హుడా కాలనీ, నిర్మల అపార్ట్మెంట్, గంగారం బస్తీ దవాఖాన ప్రాంతాల్లో ఎన్యుమరేషన్ ఫామ్ల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి కుటుంబానికి ఫామ్లను సరైన విధంగా ఎలా నింపాలో అవగాహన కల్పించారు.

స్థానిక బస్తీవాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, బీఎల్వో అధికారులు, భారతీయ జనతా పార్టీ BLA-2 ప్రతినిధులతో కలిసి SIR ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్, డివిజన్ ఉపాధ్యక్షుడు రాజు యాదవ్, బీజేపీ నాయకులు శేఖర్ ముదిరాజ్, నరసింహ ముదిరాజ్, స్వామి, యువ మోర్చా హఫీజ్పేట్ డివిజన్ ప్రధాన కార్యదర్శి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.





