శేరిలింగంపల్లిలో SIRపై బీజేపీ సమీక్ష

శేరిలింగంప‌ల్లి, జూలై 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొండాపూర్ మసీద్‌బండలోని బీజేపీ కార్యాలయంలో కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, శక్తి కేంద్ర ఇన్‌చార్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ తరఫున నియమించిన BLA-2లు ఎప్పటికప్పుడు BLOల పనితీరును పర్యవేక్షించాలని సూచించారు. డబుల్ ఓట్లను గుర్తించి తొలగించే చర్యలు తీసుకోవడంతోపాటు, ఓటు హక్కుకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటరు జాబితాలో పేరు నమోదు అయ్యేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలు బాధ్యతాయుతంగా పనిచేసి SIR ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. దొంగ ఓట్ల తొలగింపు, నిజమైన ఓటర్ల గుర్తింపుతో రానున్న GHMC ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు, దుర్గాప్రసాద్, అశోక్ కురుమ, పద్మ, సీతారామరాజు, వేణుగోపాల్ రెడ్డి, వంశీ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కిషోర్, నరసింహరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here