శేరిలింగంపల్లి, జూలై 3 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) – 2026 కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని ఈఆర్‌వో (ERO) నారాయణ్ అమిత్ తెలిపారు. జూలై 3 వరకు నియోజకవర్గంలో 60 శాతం ఎన్యూమరేషన్ ఫామ్‌ల పంపిణీ విజయవంతంగా పూర్తైనట్లు వెల్లడించారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే ఫామ్‌ల పంపిణీ కొనసాగుతోందని, మిగిలిన ఫామ్‌లను కూడా వేగంగా పంపిణీ చేసి నిర్ణీత గడువులోగా 100 శాతం కవరేజీ పూర్తి చేయాలని బూత్ లెవెల్ ఆఫీసర్లకు (BLOలు) ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ, BLOలకు పూర్తిగా సహకరించాలని, సక్రమంగా నింపిన ఎన్యూమరేషన్ ఫామ్‌లను అవసరమైన పత్రాలతో జత చేసి నిర్దేశిత గడువులోగా సమర్పించాలని నారాయణ్ అమిత్ కోరారు.





