శేరిలింగంపల్లి, జూలై 3 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ కాలనీలో ఉన్న సప్తగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నూతన ఆలయ ధ్వజ స్తంభ, శిఖర ప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవం కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్. అయ్యప్ప సొసైటీ వాసులు మధుసూదన్ రెడ్డి, కెవి రావు, వాసు, మామిడిల రాజు, పరమేశ్వర్, కాలనీ వాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.






