బీజేపీ ప‌థ‌కాలు, అభివృద్ధిపై నాయ‌కుడు నీర‌టి చంద్ర‌మోహ‌న్ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం

శేరిలింగంప‌ల్లి, జూన్ 16 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రశాంత్‌నగర్‌లో కేంద్రంలో ప్ర‌ధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించినట్లు బీజేపీ రాష్ట్ర నాయకుడు నీరటి చంద్రమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేద కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన మందులు అందించేందుకు జన ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కౌశల్ యోజన ద్వారా యువత, మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు.

స్వచ్ఛ భారత్ మిషన్ కింద దేశవ్యాప్తంగా 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించినట్లు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా 11 కోట్ల మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించినట్లు తెలిపారు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ పథకం కింద కోట్లాది లబ్ధిదారులకు ఆరోగ్య కార్డులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రశాంత్‌నగర్‌లో వైద్యులు, వ్యాపారవేత్తలను కలిసి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించినట్లు నీరటి చంద్రమోహన్ తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here