శేరిలింగంపల్లి, జూన్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): నిర్వహణ పనుల దృష్ట్యా బుధవారం (జూన్ 17) మయూరి నగర్ సబ్స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. 33/11 కేవీ మయూరి నగర్ సబ్స్టేషన్ నుంచి వెలువడే 11 కేవీ గోకరాజు రంగరాజు ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. దీంతో గోకరాజు రోడ్, ఆర్ఎల్ సిటీ రోడ్ ప్రాంతాలు ప్రభావితమవుతాయి. అలాగే 11 కేవీ బాలాజీ నగర్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుంది. బాలాజీ నగర్, వెంకట్రాయ నగర్, సిరి ఎన్క్లేవ్, ఇందిరమ్మ కాలనీ, నిజాంపేట్ ప్రాంతాలకు ఈ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. నిర్వహణ పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.





