శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో అత్యవసర వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF)కు దరఖాస్తు చేసుకున్న ఇద్దరు బాధితులకు మంజూరైన రూ.8.50 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF-LOC మంజూరి పత్రాలను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరంగా నిలుస్తోందన్నారు. ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థిక భరోసా కల్పిస్తూ, వైద్య చికిత్స ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజాక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతిగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు.

CMRF-LOC ద్వారా మంజూరైన సహాయంలో భాగంగా వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని వివేకానందనగర్ కాలనీకి చెందిన రత్నకుమారికి అత్యవసర వైద్య చికిత్స కోసం రూ.4.50 లక్షలు మంజూరయ్యాయి. అలాగే ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్ కాలనీకి చెందిన పార్వతికి రూ.4 లక్షల ఆర్థిక సహాయం మంజూరైనట్లు ఆరెకపూడి గాంధీ వెల్లడించారు. వైద్య చికిత్స కోసం సహకరించి, ఆర్థిక సాయం మంజూరు చేయడంలో కృషి చేసిన ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, శర్మ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.





