HMWSSB యూనియన్ ఎన్నికలు.. జి. రాంబాబు యాదవ్ గెలుపు కోసం ప్ర‌చారం..

శేరిలింగంప‌ల్లి, జూన్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): HMWSSB యూనియన్ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఉద్యోగి నాయకుడు జి. రాంబాబు యాదవ్ గెలుపు కోసం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హఫీజ్‌పేట్ డివిజన్‌లోని వాటర్ వర్క్స్ ఓటర్లను కలిసి జి. రాంబాబు యాదవ్‌కు మద్దతు తెలపాలని కోరారు. అనంతరం ఎన్నికల ప్రచార శిబిరంలో బీఆర్‌ఎస్ నాయకులు, ఉద్యోగులతో కలిసి సమావేశమై ఆయన విజయానికి అవసరమైన కార్యాచరణపై చర్చించారు. జి. రాంబాబు యాదవ్ ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని, ఆయన విజయం ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు దోహదపడుతుందని బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్‌పేట్ డివిజన్ బీఆర్‌ఎస్ నాయకుడు నిమ్మల రామకృష్ణ గౌడ్ పటేల్ పాల్గొని జి. రాంబాబు యాదవ్ గెలుపు కోసం మద్దతు ప్రకటించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here