ఎండల్లో అండగా శ్రీ అను సేవా ట్రస్ట్.. చలివేంద్రాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ..

శేరిలింగంప‌ల్లి, మే 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీ అను సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. హఫీజ్‌పేట్‌కు చెందిన ట్రస్ట్ సభ్యులు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, పేద రోగులకు వైద్య సహకారం, ఆహార పంపిణీ, దోమల నివారణ చర్యలు, చలివేంద్రాల ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపట్టారు. ట్రస్ట్ ఫౌండర్స్ నవీన్ కుమార్, అనుపమ మాట్లాడుతూ మియాపూర్ చెరువు సమీపంలో ప్రతి మంగళవారం, శుక్రవారం రాగిజావ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అలాగే ప్రతి రోజు ఒక కాలనీలో దోమల తీవ్రతను గుర్తించి మస్కిటో స్ప్రే నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎండలు 40 డిగ్రీలు దాటుతున్న నేపథ్యంలో ఆల్విన్ చౌరస్తాలో వాహనదారులు, ట్రాఫిక్ పోలీసుల కోసం సుమారు 2వేల వాటర్ బాటిల్స్ పంపిణీ చేసినట్లు వెల్లడించారు. విద్య, వైద్యం రంగాల్లో ట్రస్ట్ సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రజల అవసరాల కోసం ప్రభుత్వంపై మాత్రమే ఆధారపడకుండా, సమాజానికి ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు రామయ్య, జనప్రియ శివ, కృష్ణ, రామకృష్ణ, హరికృష్ణ, కరుణాకర్, శివ, పద్మజ, గీతా, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here